Home Page SliderNational

బిపోర్‌జాయ్ తీవ్ర విధ్వంసం -900 గ్రామాలపై ప్రభావం

Share with

బిపోర్‌జాయ్ తుపాను తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. దీనిప్రభావంతో ద్వారక, దేవభూమి, కచ్, జామ్ నగర్ మొదలైన ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 900 గ్రామాలపై దీని ప్రభావం పడింది. తుపాన్ తీరం దాటిన తర్వాత కూడా గాలుల తీవ్రత ఎక్కువయ్యింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఎన్నో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దాదాపు 50 గ్రామాలు విద్యుత్ లేక  అంధకారంలో మునిగిపోయాయి. గుజరాత్‌లోని ప్రాచీన ఆలయమైన ద్వారక ఆలయంతో పాటు పలు కార్యాలయాలు, స్కూళ్లు మూసివేశారు. సోమనాధ్ ఆలయాన్ని కూడా మూసివేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పశ్చిమ రైల్వేలో ముందు జాగ్రత్త చర్యగా 90 రైళ్లు రద్దు చేశారు.