NationalNews

బీహార్ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

Share with

బీహార్ సీఎంగా తాజాగా నియమితులైన నితీశ్‌కు ప్రారంభంలోనే ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. బీహార్‌ పర్యటనలో భాగంగా ఆయనకు పెనుప్రమాదం తప్పిందనే చెప్పాలి. అయితే ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.  అంతేకాకుండా  ప్రస్తుతం ఈ ఘటన దేశ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో భాగంగా మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లో ఇటీవల బంధన్ కూటమితో నితీశ్  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా సీఎం నితీశ్ ఈ రోజు బీహార్‌లోని గయా పట్టణంలో పర్యటించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఆయన అక్కడికి ముందుగా హెలికాప్టర్‌లో బయలుదేరగా..అక్కడ లోకల్‌గా పర్యటించడానికి పోలీసులు ఆయనకు కాన్వాయ్ ఏర్పాటు చేశారు.

ఆ కాన్వాయ్ పట్నా-గయా హైవేపై నుంచి బయలుదేరడంతోనే అక్కడ ఒక సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. కాన్వాయ్ బయలుదేరిన సమయంలో కొందరు ఆ హైవేపై నిరసనలు తెలుపుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం అదృశ్యమై చివరికి శవమై తేలిన గౌరీ చౌక్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మరణం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో అక్కడి ప్రజలు ఈ ఘటనపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ..ఆందోళనలు చేపట్టారు. ఇటువంటి సమయంలో సీఎం కాన్వాయ్ అటుగా రావడంతో వారంతా దానిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా నిరసనలు చేపడుతున్న యువకులు కోపోద్రిక్తులై సీఎం కాన్వాయ్‌పై రాళ్ళు విసరగా..కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం కాన్వాయ్‌లో లేకపోవడంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.