Home Page SliderNational

గూగుల్‌కు భారీ షాక్..!

Share with

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. అదేంటంటే నేషనల్ కంపెనీ  లా అప్పిలేట్ ట్రిబ్యునెల్(NCLAT) నుంచి గూగుల్‌కు చుక్కెదురైంది. కాగా గతంలో సీసీఐ గూగుల్‌పై విధించిన రూ.1337.76 కోట్ల పెనాల్టీని సవాల్ చేస్తూ గూగుల్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే  ఈ పిటిషన్‌పై  విచారణ జరిపిన NCLAT రూ.1337.76 కోట్లు కట్టాల్సిందేనని తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఒక నెల మాత్రమే గడువు ఇస్తున్నట్లు NCLATకు చెందిన ద్విసభ్య ధర్మాసనం గూగుల్‌ను ఆదేశించింది. కాగా గూగుల్ ఇటువంటి అనైతిక వ్యాపార పద్దతులను తక్షణమే మానుకోవాలని NCLAT గూగుల్‌ను హెచ్చరించింది.