Home Page SliderInternational

‘ప్రజల కోసం పోరాడే వ్యక్తి బైడెన్-స్వార్ధం చూసుకునే వ్యక్తి ట్రంప్’..ఒబామా సంచలన వ్యాఖ్యలు

Share with

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికలవేళ అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌కు మద్దతుగా నిలిచాడు. సాధారణ ప్రజల కోసం జీవితమంతా పోరాడిన వ్యక్తి బైడెన్ అని, తనస్వార్థం చూసుకునే వ్యక్తి ట్రంప్ అని వ్యాఖ్యానించారు. తన ప్రయోజనాల కోసం అబద్దాలు చెప్పే వ్యక్తి ట్రంప్ అని ఈ ఇద్దరిలో జరిగే ఎన్నికలను మొన్న జరిగిన డిబేట్ శాసించలేదన్నారు. చర్చలు సరిగా జరగని రోజులుంటాయని, చర్చల్లో ట్రంప్ పై చేయి సాధించినట్లు మీడియా వారు చెప్పినంత మాత్రాన బైడెన్ తక్కువ కాదన్నారు.

తన వయస్సును ఉద్దేశించి బైడెన్ స్పందిస్తూ నేను వృద్ధుడునే, స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. చలాకీగా నడవలేకపోవచ్చు. కానీ నా పనిని సక్రమంగా, నిజాయితీగా పూర్తి చేస్తాను. అధ్యక్షపదవిని నిర్వహించగలననే నమ్మకం ఉంది కాబట్టే మళ్లీ ఎన్నికలలో నిలబడుతున్నానని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు, అధ్యక్షుడు బైడెన్‌కు మధ్య జరిగిన డిబేట్‌లో బైడెన్ పలుమార్లు తడబాటుకు గురయ్యాడని డెమోక్రాటిక్ పార్టీ కాస్త ఆందోళన చెందుతోంది.