Home Page SliderNational

పవర్ ‘ఫుల్‌’ గా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా  ‘భోళా శంకర్’ ట్రైలర్

Share with

మెగాస్టార్ చిరంజీవి పవర్ ‘ఫుల్’ యాక్షన్ మూవీ భోళా శంకర్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను నేడు చిరు తనయుడు రామ్ చరణ్ విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ చేస్తోంది ఈ ట్రైలర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించగా, తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోదరి సెంటిమెంట్‌తో వస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ ట్రైలర్‌లో “ప్రజలకు సమస్య వస్తే పోలీసుల వద్దకు వెళ్లతారు. పోలీసులకు సమస్య వస్తే భోళా దగ్గరకు వెళతారు” అంటూ చిరంజీవి పరిచయం జరుగుతుంది. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతోంది. ఈ ట్రైలర్‌లో చిరు ఫైట్స్, డైలాగ్స్, అభినయం చూసి ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా రూపొందింది.