Home Page SliderTelangana

ఉత్తమ రవాణా విధానాన్ని తెలంగాణలోనూ: మంత్రి పొన్నం ప్రభాకర్

Share with

హైదరాబాద్: దేశంలోని ఉత్తమ రవాణా విధానాన్ని తెలంగాణలోనూ తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నూతన రవాణా విధానం కోసం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రాల వారీగా వేర్వేరు పన్నుల విధానం అమలవుతోందని.. అందులో ఆదాయం పెంచుకోడానికి అనువుగా ఉండేవాటిపై దృష్టి సారిస్తామన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో అధ్యయనం ఉంటుందని వివరించారు.