Andhra PradeshHome Page Slider

‘బీసీలంటే బ్యాక్‌వార్డ్ కాదు, బ్యాక్‌బోన్ క్లాస్’..జగన్

Share with

తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలో బీసీలంటే ‘బ్యాక్‌వార్డ్ కాదు, బ్యాక్‌బోన్ క్లాస్’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నవరత్నాల పథకాల గురించి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వరుసగా ఐదో ఏడాది నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులకు నిధులు విడుదల చేయనున్నారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఈ పథకం అందుతుందన్నారు. నేతన్నలకు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 80678 మంది ఖాతాలో ఈనిధులు నేరుగా పడుతున్నాయని తెలిపారు. వీరి ఉత్పత్తులకు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్, మిత్రా వంటి ఆన్‌లైన్ మార్కెట్లలో కూడా ఆదరణ లభించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నేతన్నలకు చేసిందేమీ లేదన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ పథకాలలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ముందు వరుసలో ఉందన్నారు.

ప్రజలకు  ఇంతమంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షాలు సంస్కారం కోల్పోయి  విమర్శిస్తున్నారని, అవమానిస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లంటే ఎవరూ బయటనుండి వచ్చిన వారు  కాదని, మన తమ్ముళ్లు, చెల్లెమ్మలేనని మన గ్రామంలోని వారేనని వెల్లడించారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లు వాలంటీర్లను అనవసరంగా విమర్శిస్తున్నారన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణే అమ్మాయిలను లోబరుచుకుని, పెళ్లిచేసుకుని, నాలుగేళ్లు కాగానే వదిలేస్తారని ఎద్దేవా చేశారు. కాగా లోకేష్ ఫారిన్ ట్రిప్స్ వెళ్లి అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్స్‌లో ఆడుకుంటాడని, యూట్యూబ్ వీడియోలలో వైరల్ అయ్యాడని ఎద్దేవా చేశారు. క్యారెక్టర్ లేని వీరు మంచి పనులు చేస్తున్న వాలంటీర్ల క్యారెక్టర్లను విమర్శించడానికి అర్హత లేదన్నారు. పవన్ బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం చేస్తున్నారన్నారు. వీరి చరిత్ర అంతా వంచన, వెన్నుపోట్లేనని విమర్శించారు.