Home Page SliderNational

బాలయ్య కొత్త సినిమా టీజర్ అదుర్స్

Share with

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా,అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “భగవంత్ కేసరి”. కాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది. నేడు బాలయ్య పుట్టిన రోజు కానుకగా దీన్ని రిలీజ్ చేశారు. “నేలకొండ భగవంత్ కేసరి..ఆ పేరు శానా ఏండ్లు యాదుంటది”అని బాలయ్య మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టారు. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.