Andhra PradeshHome Page Slider

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు నామినేషన్

Share with

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే.కాగా ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రులతోపాటు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ రోజు అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు.కాగా అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ వేశారు. ఈ మేరకు రేపు అసెంబ్లీలో స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.