Home Page SliderTelangana

ఉచిత ప్రయాణంతో ఆటో వాలాలు రోడ్డున పడ్డారు!

Share with

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తమ ఉపాధిని దెబ్బతీస్తోందంటూ ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో మంగళవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు పస్తం అయిలయ్య మాట్లాడుతూ ఆటోల్లో మహిళలు ఎవరూ ఎక్కడం లేదని, ఆటో నడిస్తేనే తప్ప కుటుంబాన్ని పోషించుకోలేమన్నారు. తమ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తీసుకున్న మా ఆటోవాలాల పరిస్థితి అయోమయంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల బాధలను గుర్తించి అన్నివిధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.