Home Page SliderNews

ఆస్ట్రేలియా మూడో టెస్ట్, 109 పరుగులకే కుప్పకూలిన భారత్

Share with

ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు తుస్సుమనిపించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మాథ్యూ కుహ్నెమాన్ టెస్ట్ క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పతకాన్ని నమోదు చేయగా, నాథన్ లియాన్ మూడు, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశాడు. దీంతో ఆస్ట్రేలియా మూడో టెస్టు మొదటి రోజు 109 పరుగుల వద్ద భారత్‌ను ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా స్పిన్ ధాటికి ఆతిథ్య జట్టు విఫలమవడంతో భారత్ తరుపున విరాట్ కోహ్లీ (22 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌తో భారత్ జట్టులోకి రాగా, మహ్మద్ షమీకి విశ్రాంతినిస్తూ ఉమేష్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గైర్హాజరీలో ఆస్ట్రేలియాను స్టీవ్ స్మిత్ నడిపిస్తున్నాడు.