Home Page SliderInternational

టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన ఆస్ట్రేలియా

Share with

ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన టిక్‌టాక్ క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోతుంది. కాగా టిక్‌టాక్‌తో వ్యక్తిగత,దేశ భద్రతకు భంగం కలుగుతుందని రుజువైయ్యింది. ఈ నేపథ్యంలో దీనిని వినియోగించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు ఆసక్తి చూపడం లేదు. కాగా భారత దేశంతోపాటు ఎన్నో దేశాలు టిక్‌టాక్‌ను నిషేదించాయి. అయితే తాజాగా ఆస్ట్రేలియా కూడా టిక్‌టాక్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే భద్రతా కారణాల రిత్యా ప్రభుత్వ పరికరాల్లో టిక్‌టాక్‌ను నిషేదించింది. కాగా వ్యక్తిగత ,దేశ పరిరక్షణకు  సంబంధించిన డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు USA,కెనడా ,UK,న్యూజిలాండ్ వంటి దేశాలు టిక్‌టాక్‌పై ఇప్పటికే నిషేదించాయి. తాజాగా ఆ జాబితాలోకి ఆస్ట్రేలియా కూడా వచ్చి చేరింది. ఈ నిషేదం త్వరలోనే అమలులోకి వస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది.