Home Page SliderNational

ఆ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు

Share with

మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అసెంబ్లీ, పార్లమెంటు  ఎన్నికలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే జమ్మూ& కాశ్మీర్‌లో మాత్రం ఏకంగా 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కాగా ఇప్పటికే కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ ప్రకటించింది. అయితే జమ్మూ&కాశ్మీర్‌లో చివరగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీ-పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ముఫ్తీ మహ్మద్ సయ్యద్ సీఎంగా ఎన్నికయ్యారు. అయితే ఆయన సీఎం పదవీ స్వీకరించిన 2 సంవత్సరాలకే మరణించగా ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. దీంతో 2016లో బీజేపీ పార్టీ పీడీపీకి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంది. కాగా అప్పటి నుంచి జమ్మూ&కాశ్మీర్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది.