Home Page SliderNational

ఆకాశంలో తేలుతున్నట్లుంది- యూపీఎస్సీ టాప్ ర్యాంకర్

Share with

ఇషితా కిషోర్, నిన్న యూపీఎస్సీ రిజల్ట్ వచ్చినప్పటి నుంచీ ఆమె పేరు దేశమంతా మారుమ్రోగిపోతోంది. ఈ ఉదయం తనకెంతో ప్రత్యేకంగా అనిపించిందని, ఆకాశంలో, గాలిలో తేలుతున్న ఫీలింగ్ వచ్చిందని మీడియాతో తన మనసులోని ఫీలింగ్స్ పంచుకుంది ఇషిత. భారత్‌లోనే క్లిష్టమైన పరీక్షగా పేరుపొందిన సివిల్స్‌పరీక్షలో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే మొదటి ర్యాంకు సాధించింది ఈ అమ్మాయి.

బీహార్‌కు చెందిన ఈ టాపర్ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో ఎకనామిక్స్, కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసింది. మూడవసారి ఈ పరీక్షకు హాజరయిన ఆమె గతంలో రెండుసార్లూ ప్రిలిమ్స్‌లోనే వెనుదిరిగింది. దేశానికి సేవ చేయాలనే దృఢసంకల్పంతో పట్టువదలకుండా ప్రయత్నించి మూడవసారి జాక్‌పాట్ కొట్టింది. తాను గతంలో ఈ పరీక్షను సాధించని సమయంలో తన కుటుంబం తనకు చాలా ధైర్యానిచ్చిందని, తాను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అక్కున చేర్చుకుందని తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ఈసారి సెలక్ట్ కానివారు వారి ప్రయత్నం విరమించవద్దని, ధైర్యంగా వారిని వారే ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగిపోవాలని సలహా ఇస్తోందామె. గత సంవత్సరం కూడా మహిళలే టాప్ 3 ర్యాంకుల్లో ఉండడం విశేషం.