Home Page SliderNational

హీరో విజయ్‌ను అరెస్ట్ చేయండి:మహిళా నేత

Share with

హీరో దళపతి విజయ్‌ను అరెస్ట్ చేయాలని ఓ మహిళ నేత పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశమైంది.కాగా హీరో విజయ్ తనను బెదిరిస్తున్నారని తమిళనాడుకు చెందిన మహిళా నేత రాజేశ్వరి ప్రియ ఆరోపించారు. విజయ్ కొత్త సినిమా లియోలోని నా రెడీ పాటలో డ్రగ్స్,రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ ఇటీవల ఆమెతో సహా పలువురు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి విజయ్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా తనపై నెట్టింట అసభ్యకరంగా పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని ఆల్ పీపుల్స్ పార్టీ నేత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌ను అరెస్ట్ చేయాలని ఆమె తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు.