Telangana

ఆర్మూర్ ఎమ్మెల్యే అత్యుత్సాహం… యాదాద్రికి మునుగోడు ఓటర్లు

Share with

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. ఏకంగా 15 బస్సుల్లో ఎస్కార్ట్ తో వారిని గుట్టపైకి తీసుకెళ్లి మరీ రూ.150 ప్రత్యేక దర్శనం ద్వారా కుటుంబ సమేతంగా దర్శనం కల్పించారు. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపురం గ్రామానికి చెందిన ఓటర్లను టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 15 బస్సుల్లో యాదగిరి గుట్టకు తీసుకొచ్చారు. ఆ బస్సులకు ఆర్మూర్ చైర్ పర్సన్ 9999 ఫార్చునర్ కారు ఎస్కార్ట్ గా వెళ్లింది. యాదగిరి గుట్టకుచేరుకున్న బస్సులను ఆలయ అధికారులు నేరుగా కొండపైకి అనుమతించారు. అయితే వారు అక్కడికి చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఆ సమయంలో స్వామి వారికి ఆరగింపు సేవ ఇవ్వాలి. కానీ ఆ సేవను నిలిపివేసి మరీ దండు మల్కాపురం గ్రామస్థులకు దర్శనానికి అవకాశం కల్పించారు. దర్శనం తర్వాత వారికి విందు ఏర్వాట్లు చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆలయ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.