Home Page SliderInternational

మీరు KFC చికెన్ తింటున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త

Share with

మీరు చికెన్ ప్రియులా..అందులోనూ KFC చికెన్ అంటే అమాంతం లాగించేస్తారా? అయితే ఇకపై KFC చికెన్ తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు KFC చికెన్‌లో చికెన్‌తోపాటు మేకులు కూడా వస్తున్నాయి. మరి మేకులను కూడా చికెన్ అని తినేశారంటే అంతే సంగతులు. అదేంటి KFC చికెన్‌లో మేకులా అని ఆశ్చర్యపోకండి. ఇది మీలాగే KFC చికెన్‌ను ఇష్టపడే KFC చికెన్ ప్రియులకు ఎదురైన అనుభవం. కాగా ఓ వ్యక్తి మంచి ఆకలితో KFC చికెన్ లాగిద్దామని ఇంటికి పార్శిల్  తెచ్చుకున్నాడు. అయితే ఆ పార్శిల్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాడు. కాగా నోట్లో చికెన్ కరకరలాడుతోంది. ఆ సమయంలోనే అతని పళ్లకి రాళ్ల లాంటి వస్తువు అడ్డు పడింది. అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఎందుకంటే ఆ చికెన్‌లో మేకు ఉంది. కాగా యూకేలోని గిలింగ్‌హామ్‌కు చెందిన కల్లమ్ ఫిహన్‌కు ఈ వింత అనుభవం ఎదురైంది. దీంతో ఆ మేకును గుర్తించకపోయి ఉంటే ఏమై ఉండేదో అని అతను భయాందోళనకు గురయ్యాడు. అయితే ఇంత జరిగినా స్థానిక KFC యాజమాన్యం దీనిపై స్పందించలేదని కల్లమ్ వాపోయాడు.