Andhra Pradesh

పేదలకు 30 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రశంసనీయం

Share with

ఏపీలో పేదరిక నిర్మూలన కింద ఇళ్ల నిర్మాణం భేష్
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ప్రశంసలు

ఏపీ ప్రభుత్వం పేదల కోసం 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి పూనుకోవడం అభినందిచదగ్గ విషయమని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ప్రశంసించారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సాగుతున్న ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏపీలో పేదలందరికీ ఇళ్లు అనే పథకం కింద సీఎం జగన్ ప్రభుత్వం నిరుపేదలు, ఇళ్లు లేని పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టి ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించిన మంత్రి విశాఖ, విజయవాడల్లో జరిగిన సమావేశాల్లో ఏపీ ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకంపై ప్రశంసలు కురిపించారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఏపీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.