Home Page SliderNational

టీమిండియాకు WTC ఫైనల్‌లో ఓటమితోపాటు  మరో షాక్

Share with

టీమిండియా WTC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ప్లేయర్ల ఆటపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్,మాజీ టీమిండియా ప్లేయర్ సునీల్ గవాస్కర్ టీమిండియా జట్టు ఎంపికపై,వారి ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్స్‌కు పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే టీమిండియా ప్లేయర్లకు ICC భారీకోత విధించింది. WTC ఫైనల్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మొత్తానికి మ్యాచ్ ఫీజులో 100% కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే WTC ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుకు కూడా ICC మ్యాచ్ ఫీజులో 80% కోత విధించింది. ఈ మేరకు ICC ఇవాళ ఓ ప్రకటన  విడుదల చేసింది. నిర్ణీత సమయంలో భారత్ 5 ఓవర్లు,ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేశాయని ICC ఆ ప్రకటనలో పేర్కొంది.

అయితే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అదనపు జరిమానా పడింది. కాగా రెండో ఇన్నింగ్స్ ఆడే సమయంలో గిల్ ఔట్ అయ్యినప్పుడు అంపైర్ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేశాడు. దీంతో శుభ్‌మన్ గిల్‌కు మరో 15% జరిమానా విధించారు. ఈ విధంగా గిల్ అందరి కంటే ఎక్కువగా 115% మ్యాచ్ ఫీజులో కోత ఎదుర్కొన్నాడు. దీంతో టీమిండియా పరిస్థితి ప్రస్తుతం మూలీగే నక్క మీద తాటికాయలా తయారయ్యింది.