Home Page SliderTelangana

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Share with

వాయువ్య బంగాళా ఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడుతోందని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తుఫాన్ ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. తెలంగాణలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని చెరువులు ఉప్పొంగుతున్నాయి. మూసీనది డేంజర్ లెవల్‌ను దాటి ప్రవహిస్తోంది. హుస్సేన్ సాగర్, హిమయత్ సాగర్‌ సరస్సుల నుండి తూముల నుండి నీటిని పెద్ద ఎత్తున దిగువకు విడుదల చేస్తున్నారు.

నాన్ స్టాప్‌గా కురుస్తున్న వర్షాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనిపించినా ఈ రోజు నుండి మళ్లీ విజృంభిస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో అసిఫాబాద్, మంచిర్యాల, కొమరం భీమ్ జిల్లాలో, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కుండపోత వర్షాలు పడవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినా, ఈ రోజు నుండి విద్యాలయాలకు చిన్నారులు బయలుదేరారు. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. హైదరాబాద్‌లో కూడా తేలిక పాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.