Home Page SliderNational

బోరు బావిలో పడ్డ మరో చిన్నారి

Share with

“ఓ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం”. మన దేశంలో ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటి వరకు ఎంతోమంది చిన్నారులు బోరు బావిలో పడి బలయ్యారు. అయితే వీటిని అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ వాటిని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. దీంతో అభం శుభం తెలియని చిన్నారులు తరచుగా బోరు బావుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా మరో చిన్నారి బోరు బావిలో పడింది. కాగా ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో చోటు చేసుకుంది. ముగవాళి గ్రామానికి చెందిన శృష్టి కుశ్వాహా అనే రెండేళ్ల చిన్నారి ఆడుకుంటూ నిన్న మధ్యహ్నం ప్రమాదవశాత్తు  బోరు బావిలో పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కాగా దీని గురించి సమాచారం పోలీసులు హటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. కాగా ప్రస్తుతం చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. చిన్నారిని రక్షించేందుకు రెవెన్యూ ,NDRF ,పోలీసు సిబ్బంది “,ఆపరేషన్ శృష్టి” పేరుతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.