Andhra PradeshNews

రాజధానిపై 27న క్లారిటీ వస్తోందా? కేంద్ర హోంశాఖ ఏం చెప్పనుంది?

Share with

కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానుల విషయంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చింది. ఏపీలో కొత్త రాజధానికే నిధులు ఇస్తామని కేంద్ర స్పష్టం చేసింది. మూడు రాజధానుల ప్రస్తావన అజెండాలోనే లేదని తెలిపింది. కేంద్ర అజెండాలో రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానం అంశం, ఇరురాష్ట్రాల మధ్య పరిష్కారం, విభజన  కావాల్సిన అంశాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. అలాగే షెడ్యూల్ 9లో ప్రభుత్వ కంపెనీలు,కార్పొరేషన్లు ఉన్నాయని పేర్కొంది. అదే విధంగా విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపిణీ గురించి కేంద్రం ఈ అజెండాలో ప్రస్తావించింది. ఈ మేరకు రాష్ట్ర విభజన అంశాలపై  ఈ నెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. ఏపీ రాజధానికి కేంద్ర సహకారంపై ఈ సమావేశంలో అధికారులు చర్చించనున్నారు. అయితే ఏపీలో ఒక రాజధానికి మాత్రమే నిధులు ఇస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ 3 రాజధానులపై అసలు అజెండాలోనే ప్రస్తావించలేదని తెలియజేసింది.