International

అందాల హరివిల్లు గుహలు – అద్భుత దృశ్యాలు

Share with

ఎవరైనా గొప్ప చిత్రకారుడు రంగులద్దాడా అన్నట్లు, అద్భుత శిల్పాల్లా కనిపిస్తున్న అందమైన మంచు గుహలు అవి. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న మౌంట్ రైనర్ నేషనల్ పార్క్‌లో ఉన్న ఓ మంచు గుహ గురించే మనం చెప్పుకుంటున్నాం.

నిత్యం మంచుతో కప్పబడి ఉండే ఈ గుహ పాలరాతితో చెక్కినట్లు ఉంటుంది. దీనికి ఉన్న ఒక ద్వారం ద్వారా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించి మంచుపై ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ కారణంగా సూర్యకాంతి పరావర్తనం చెంది, హరివిల్లులా విడిపోయి, రంగురంగుల్లో అద్భుత దృశ్యాలు ఆవిష్కరింపబడతాయి.

ఇవి అందంగా ఉన్నాయి కదా, వెళ్లి చూద్దామనుకోవడానికి వీలులేదు. ఎంత అందమైనవో అంత ప్రమాదకరమైనవి. గుహల పైభాగం నుండి తరచూ పెద్ద పెద్ద మంచు పెళ్లలు విరిగిపడుతూ ఉంటాయి. ఆలా మనుషులపై పడితే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అందుకే ఇక్కడికి ప్రవేశించడాన్ని కొన్నేళ్ల క్రితమే నిషేధించారు. ఈ గుహల్లో అతి తక్కువ ఉష్ణోగ్రలు కూడా చాలా ప్రమాదకరం. అప్పుడప్పుడు నీరు కరిగి పడుతూ జారిపడే అవకాశాలు కూడా చాలాఉన్నాయి.

లోపలికి వెళ్లిన వారికి ఆక్సిజన్ కూడా అందక స్పృహ తప్పే ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్య మ్యాథ్యూ నికోలాస్ అనే ఓ ఫొటోగ్రాఫర్ ప్రాణాలకు తెగించి ఇటీవల ఈ గుహలోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకువచ్చారు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దామా..