Home Page SliderTelangana

రహ్మత్ నగర్‌లో రేకుల షెడ్ కూలి 8నెలల పాప మృతి

Share with

నారాయణ్ ఖేడ్ నుండి బ్రతుకు తెరువుకు నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుంటూ బ్రతికే ఆ కుటుంబానికి తీవ్రకష్టం వచ్చింది. గత రాత్రి 8 గంటల వేళ గాలివానకు నిద్రపోతున్న 8 నెలల చిన్నారి మీద పక్కన ఉన్న బిల్డింగులోని నిర్మాణంలో ఉన్న ఇటుకగోడ కూలిపడింది. వేగంగా దూసుకువచ్చిన ఇటుకల కారణంగా చిన్నారి జీవనిక మృతి చెందింది. తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా 4 అంతస్తుల పైన ఉండే ఇటుకలు రేకుల షెడ్డును చీల్చుకుంటూ వచ్చి వీరి ఇంట్లో గదిలో నిద్రిస్తున్న చిన్నారిని చిదిమేసాయి. ఆ కుటుంబం వారు వచ్చే నాలుగురోజుల్లో ఇల్లు మారాల్సి ఉంది. మే 1 నాటికి కొత్త ఇంటికి మారదామనుకున్న వారిపై ఇంతలోనే భారీవర్షం రూపంలో మృత్యువు విరుచుకుపడింది. వారి రోదనలు మిన్నంటుతున్నాయి.