NationalNews

‘నేను లొంగేది లేదు’ అమృత్‌పాల్ సవాల్

Share with

తాను ప్రత్యేక పంజాబ్ దేశం సాధించేవరకూ లొంగేది లేదని పోలీసులకు సవాల్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఖలిస్తాన్ నేత అమృత్‌పాల్ సింగ్. గత రెండురోజులుగా అమృత్‌పాల్ లొంగిపోతున్నాడంటూ పోలీసులు హడావుడి చేశారు. గత కొద్ది రోజులుగా పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఇతని విషయంలో ఇప్పటికే పోలీసులకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. 80 వేల మంది పోలీసులు ఉండి ఒక్కడ్ని పట్టుకోలేక పోతున్నారంటూ మొట్టికాయలు వేసింది. ఇప్పుడు అమృత్‌పాల్ యూట్యూబ్ వీడియో సంచలనంగా మారింది.