Home Page SliderNational

“అమితాబ్ ఓ లెజెండ్ ఆయనకు నా సెల్యూట్”..అశ్వినీదత్

Share with

‘బాలీవుడ్ హీరోలలో అమితాబ్‌ ఓ లెజెండ్ అని, ఆయనకు సెల్యూట్ చేస్తున్నానని, ఆయనకు మించినవారు లేరంటూ’ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం జరిగిన ‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అమితాబ్ తన కాళ్లకు మొక్కాలనుకోవడంతో తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ అశ్వనీదత్  దాదాపు 50 ఏళ్లుగా నిర్మాతగా రాణిస్తున్నారని, అయినా ఎంతో వినయంగా ఉంటారని అలాంటి వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని ఆయన కాళ్లకు మొక్కబోయాడు. ఈ సంఘటనతో తాను అయోమయానికి గురయ్యానని, తేరుకుని నేనూ ఆయన పాదాలు తాకే ప్రయత్నం చేశానని అశ్వనీదత్ పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తి అమితాబ్ అని, ఆయన వ్యక్తిత్వానికి సెల్యూట్ చేస్తున్నానని వివరించారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.