Home Page SliderNational

110 కిలోల బంగారం పూత గల ఆంజనేయవిగ్రహం ఆవిష్కరించిన అమిత్‌ షా

Share with

54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని, 110 కిలోల బంగారం, వెండి పూత పూసిన 350 కిలోల బరువుగల ఆరున్నర అడుగుల మరొక హనుమాన్ విగ్రహాన్ని అమిత్ షా గుజరాత్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. వీటిని బోటాడ్‌లోని సారంగ్ పూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆవిష్కరించారు. 54 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని సారంగపూర్‌లో ఉంచుతామని, ఆరడుగుల బంగారు విగ్రహాన్ని మాత్రం తన సొంత ఇంట్లోనే పెట్టి పూజలు చేస్తామని వాటిని తయారు చేయించిన సూరత్‌కు చెందిన నిర్మాణ సంస్థ వ్యాపారి తెలిపారు. అమిత్ షా తన కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జైషాతో కలిసి ఈ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ వ్యవస్థాపక దినం కూడా హనుమాన్ జయంతి రోజే రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.