Andhra PradeshHome Page Slider

అంబటి రాంబాబు జనసేన నేతల మధ్య ‘సినిమాల వార్’

Share with

ఆంధ్రప్రదేశ్  మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకి, పవన్ కళ్యాణ్ అభిమానులైన జనసేన నేతలకి మధ్య సినిమాల వార్ కొనసాగుతోంది. పోటాపోటీగా ఒకరిమీద ఒకరు సినిమాలు తీస్తామంటూ మాటల యుద్ధం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో లో తన డ్యాన్స్‌ను కించపరిచేలా ఒక నటుడి డ్యాన్స్ ఉందని, తాను సంక్రాంతికి చేసిన డ్యాన్స్‌ను అనుకరించారని, అవమానపరిచారని అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్‌పై ఫైరయ్యారు. దీనితో ఆ చిత్రవర్గం అలాంటిదేం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ చిత్రానికి అక్రమ ఫండింగ్ వచ్చిందని ఆరోపణలు చేశారు. ఢిల్లీకి వెళ్లి దర్యాప్తు సంస్థలుకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అంటూ కౌంటర్ వేశారు. తాళి-ఎగతాళి, మూడు పెళ్లిళ్లు- ఆరు విడాకులు అంటూ పవన్‌ను ఎగతాళి చేశారు. 

BRO  చిత్రానికి పోటీగా MRO అనే చిత్రం తీస్తానంటూ హెచ్చరించారు. MRO అంటే మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్ అంటూ సినిమా పేరు చెప్పారు అంబటి. దీనికి జనసేన నేతలు ఘాటుగా సమాధానమిచ్చారు. జనసేన నేత పోతిన కూడా నాలుగు చిత్రాల పేర్లు చెప్పారు. అంబటిపై కూడా చిత్రాలు తీస్తామని SSS అంటే సందులో సంబరాల శ్యాంబాబు అంటూ కౌంటర్ ఇచ్చారు. బ్రో చిత్రానికి అక్రమ ఫండింగ్ వచ్చిందని, చంద్రబాబు బ్లాక్‌మనీ అమెరికాలోని మిత్రుల ద్వారా వైట్‌మనీగా మార్చారని, దానినే ఈ చిత్రానికి ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై  కొందరు ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంప్లైంటు ఇస్తానని,  తనవద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు అంబటి రాంబాబు.