Andhra PradeshHome Page Slider

పాలనతో పాటు పార్టీ పైన పూర్తిస్థాయి పట్టు సాధించిన సీఎం జగన్

Share with

ఏపీలో అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా, అతి తక్కువ వయసులోనే ప్రాంతీయ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి రికార్డు సాధించిన జగన్ 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు వైఎస్ఆర్సిపి ని ఓడించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా మరోవైపు తిరిగి అధికారాన్ని సొంతం చేసుకోవాలని జగన్ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.అందులో భాగంగానే గడిచిన మూడేళ్లుగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన గడిచిన ఏడాదికాలంగా పార్టీ పరమైన కార్యకలాపాల పైన ఫోకస్ పెంచారు.ఎప్పటికప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్టీల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటూ వారి మైలేజీ మరింత పెరిగేలా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇటు పాలనపైన అటు పార్టీ పైన పట్టు సాధించేలా నిర్ణయం తీసుకోవడం అంటే ఆషామాషీ కాదు.ప్రజల సంక్షేమమే సంకల్పంగా ముందుకు సాగుతూ తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ అందరిని సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా ముందుకు నడిపించాలని ఉద్దేశంతో జగన్ గడిచిన నాలుగేళ్లుగా పేద ప్రజల కోసం ఆర్థికపరమైన పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతున్నారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల పేద ప్రజలలోను ఆర్థికపరంగా కొంత మార్పు కనిపిస్తుంది.ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయా వర్గాలకు చెందిన ప్రజలే బహిరంగంగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని కుటుంబాలు ఆర్థికంగా బలపడటంతో పాటు వారి జీవితాల్లో కొత్త వెలుగులు కూడా కనిపిస్తున్నాయి.అందుకోసం సీఎం జగన్ ఐదేళ్ల ప్రణాళికను రూపొందించుకున్నారు.అయితే నాలుగేళ్లలోపే తాను చేపడుతానన్న పనులను దాదాపుగా పూర్తి చేసి తానేంటో చాటి చెప్పారు. గతంలో అనేక ప్రభుత్వాలు వెనుకబడిన ప్రజలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే తప్ప అధికారంలోకి వచ్చాక వారికోసం కొత్తగా తెరపైకి తెచ్చిన పథకాలు చాలా తక్కువ. అవి కూడా నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారు. సీఎం జగన్ మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు రాష్ట్రాన్ని వెంటాడుతున్న లెక్కచేయకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నారు. దీంతో గడిచి నాలుగేళ్లలో వైఎస్ఆర్ సీపీకి మరింత ఆదరణ పెరిగిందని జగన్ పరిపాలపై పట్టు సాధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.