Home Page SliderTelangana

పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫస్ట్ విడత సీట్ల కేటాయింపు

Share with

టిజి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరం ఫస్ట్ విడత సీట్ల కేటాయింపు జాబితాను సాంకేతిక విద్యా కమిషనర్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. 37 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 13,524 సీట్లకు గాను 11,583 సీట్లు, 56 ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 15,407 సీట్లకు 9,307 సీట్లను భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. మరో 8,041 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.