Home Page SliderTelangana

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు..

Share with

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు నేడు శాఖలను కేటాయించారు. మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. దీంతో, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై క్లారిటీ తీసుకొని కేటాయింపు జరిగింది. కీలకమైన హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది.

మంత్రులు, వారి శాఖలు ఇవే.. రేవంత్ రెడ్డి-హోం శాఖ, మున్సిపాలిటీ, విద్య, మల్లు భట్టి విక్రమార్క- ఆర్థిక శాఖ, ఇంధన శాఖ, దామోదర రాజనర్సింహ- వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి-సివిల్ సప్లైస్, నీటి పారుదల, సీతక్క- పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఉమెన్ వెల్ఫేర్, శ్రీధర్‌బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, కొండా సురేఖ- అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ, పొంగులేటి శ్రీనివాస్- సమాచార శాఖ, రెవెన్యూ, హౌసింగ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి- ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ, జూపల్లి- ఎక్సైజ్, పర్యాటక శాఖ, పురావస్తు, తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు, పొన్నం ప్రభాకర్-రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ.