Home Page SliderTelangana

కేసీఆర్ సభలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి…

Share with

ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో హామీలిచ్చి, వేటినీ అమలుచేయడం లేదని మండిపడ్డారు బీజేపీ నేత ఈటల రాజేందర్. సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదని , రోజూ వందల మంది విద్యార్థులు, ప్రజలు మా వద్దకు వచ్చి మా యొక్క సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి అని మొరపెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ  కనివిని ఎరుగని రీతిలో తెలంగాణలో వరదలు వచ్చి వేల ఎకరాలు కోతకు గురైనవి, వందల ఎకరాల పంట నష్టం, మనుషులు, పశువులు కొట్టుకుపోయిన ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించలేదు. నిర్మల్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో వరద బాధిత  ప్రాంతాలను పర్యటించాము. 25 వేల చొప్పున వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంచిర్యాల, చెన్నూరు, ములుగు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారిని కలిసి కేంద్ర బృందాల సహాయం కోరితే వారిని తక్షణమే పంపడం జరిగిందన్నారు. .

ప్రైవేట్ వాళ్లకి బస్సులు ఇచ్చి ఆర్టీసీని కతం పట్టించే కుట్ర జరుగుతుంది. తెలంగాణ వచ్చిన నాడు 56,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉండేవారు, కానీ ఇప్పుడు 43 వేల మందికి ఉన్నారు. 9వేల ఆర్టీసీ బస్సులు ఉండేవి.. ఇవాళ 6000 కు తగ్గిపోయినాయి, ప్రైవేట్ బస్సులు 1200 ఉండేవి ఇప్పుడు 3000 బస్సులకు పెరిగిపోయినాయి.. 18,000 మంది VRO, VRA లను మిషన్ భగీరథ పనులకు వాడుకుంటున్నారు. గెస్ట్ లెక్చరర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులు సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.