Home Page SliderNational

వైరల్ అవుతున్న ‘ఆదిపురుష్’ సీతారాముల AI ఫొటోలు

Share with

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడుకలోకి వచ్చాక టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. దీని సహాయంతో పలు సందేహాలకు సమాధానాలు కనుక్కోవడమే కాదు. లేనిది ఉన్నట్లుగా కొత్త మాయను సృష్టిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ చిత్రం పై అందరూ కుతూహలంగా ఉన్నారు. ఇప్పుడు దేశమంతా ‘ఆదిపురుష్’ సినిమా మేనియాలో ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని సీతారాములుగా నటించిన ప్రభాస్, కృతిసనన్‌ల ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎడిట్ చేశారు. నెటిజన్లు వీటిని చూసి ఖుషీ అవుతున్నారు.