National

మళ్లీ ట్రిపుల్ తలాక్ వివాదం

Share with

వివాహ బంధానికి ఆధునిక కాలంలో అర్థం లేకుండా పోతోంది. జీవితాంతం తోడుగా ఉంటామని ప్రమాణాలు చేసుకున్న భార్యాభర్తలు చిన్నచిన్న కారణాలకే విడిపోతున్నారు. ముఖ్యంగా కొన్ని కారణాలు వింటుంటే చాలా సిల్లీగా అనిపిస్తాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో ఓ వ్యక్తి తన భార్య బరువు పెరిగిందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఊహించని ఈ సంఘటనకి షాక్ అయిన భార్య తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. వివాహం జరిగి 8 ఏళ్లు అయ్యిందని, ఏడేళ్ల కుమారుడు ఉన్నాడని పేర్కొంది. ఒక నెలక్రితం లావు అయిపోతున్నావంటూ త్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుండి గెంటివేశారని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తలాక్ అని మూడుసార్లు చెబితే విడాకులు మంజూరయ్యే విధానానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటీషన్లు వేశారు. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ 2018 డిసెంబర్ 27న ప్రధాని మోదీ ప్రభుత్వం లోక్‌సభలో ఆమోదం తెలిపింది. దీనికి మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఈ ట్రిపుల్ తలాక్‌ను చాలా దేశాలు నిషేధించాయి.