Home Page SliderPoliticsTelangana

సంక్రాంతి తర్వాత తెలంగాణలో మరో కొత్త పార్టీ..

Share with

సంక్రాంతి తర్వాత కేసీఆర్‌ కనుసన్నల్లో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. కుర్చీ ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాల కొరకు ప్రజల యొక్క మనోభావాలను ఆడుకోనేటట్టుగా వ్యవహరిస్తూ.. విభజన చట్టం అమలు జరగనీయకుండా ఇద్దరు సీఎంలు సక్సెస్‌ఫుల్‌ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. ‘నాకు నువ్వు నీకు నేను’ అన్నట్టుగా తీరు ఉందన్నారు.  విభజన సమస్యలపై కేంద్ర మీటింగ్‌కు… ఏపీ వాళ్లు హాజరైతే, తెలంగాణ వాళ్లు వెళ్లడం లేదని, తెలంగాణ వాళ్ళు వెళ్తే.. ఏపీ వాళ్ళు వెళ్లట్లేదని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీపై ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఠాగూర్‌ వెళ్లినా.. థాక్రే వచ్చినా ఇది ముమ్మాటికీ కేసీఆర్‌ కాంగ్రెస్సే అని ఎద్దేవా చేశారు.