Home Page SliderNational

‘ఆదిపురుష్’140 కోట్లతో ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డు-‘ప్రభాస్’కు కూడా సరికొత్త రికార్డు

Share with

స్టార్ హీరో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ నటించిన ఆదిపురుష్ చిత్రం అనుకున్నట్లుగానే కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొదటి రోజు కలెక్షన్లు 140 కోట్ల రూపాయలు రావడంతో ఇది ప్రపంచరికార్డుగా నిలిచింది. అంతేకాదు హీరో ప్రభాస్ నటించిన బాహుబలి-2 తొలిరోజు 122కోట్లు, సాహో 100 కోట్లు, ఇప్పుడు ఆదిపురుష్ 140 కోట్లు మొదటి రోజే సాధించడంతో భారత సినీ పరిశ్రమలో రిలీజైన మొదటిరోజే 3 సినిమాలు 100 కోట్ల రూపాయల పైన సాధించిన ఘనత వహించిన తొలి హీరోగా పేరు పొందాడు ప్రభాస్. ఈ చిత్రం మొదటిరోజు కలెక్షన్ 100 కోట్లు దాటుతుందని ముందే అంచనాలు వేసినప్పటికీ 140 కోట్ల రూపాయలు రావడంతో మేకర్స్ ఆనందంతో పొంగిపోతున్నారు. నిజానికి వారం రోజుల వరకూ టికెట్లన్నీ ముందే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. దీనితో సినిమా టాక్‌తో సంబంధం లేకుండానే రావలసిన కలెక్షన్స్ వచ్చేశాయి. టాప్ 5 హిందీ చిత్రాలలో ఇది ఫస్ట్ డే కలెక్షన్స్‌లో రికార్డు సృష్టించింది. టాప్ 5 భారతీయ ఓపెనర్లలో గ్రాండ్ ఓపెనర్‌గా నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా నిలిచింది.

దర్శకుడు ఓం రౌత్ నిర్మించిన విజువల్ వండర్‌గా, రామాయణ కథతో భక్తి ప్రధానంగా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టి పడేస్తోంది ఈ చిత్రం. ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేకుండా పోయింది. త్రీడీ ఎఫెక్ట్స్‌తో యువతను, పిల్లలను ఆకట్టుకుంటున్నాయి చిత్రంలోని సన్నివేశాలు. భారీ బడ్జెట్ కావడంతో ఈ చిత్రాన్ని టి సిరీస్, భూషణ్ కుమార్-క్రిషన్ కుమార్, సుతార్ ,ఓం రౌత్, రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.  పీపుల్ మీడియా ఫాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.