Home Page SliderNational

బాలీవుడ్ యాక్షన్ హీరోకు షూటింగ్‌లో ప్రమాదం

Share with

బాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో అక్షయ్‌ కుమార్ షూటింగ్ చేస్తుండగా గాయపడ్డారు. స్కాట్‌లాండ్‌లో జరుగుతున్న బడేమియా ఛోటే మియా చిత్ర షూటింగ్‌లో మరొక బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి షూటింగ్ చేస్తున్నారు. దీనిలో ఒక స్టంట్ సీన్ చేయవలసి వచ్చింది. ఈ సీన్‌లో స్టంట్ చేస్తుండగా అక్షయ్ కుమార్ మోకాలికి గాయం అయ్యింది. అయితే పెద్దగా ప్రమాదం లేదని, కొన్ని రోజులపాటు యాక్షన్ సన్నివేశాల షూటింగులకు దూరంగా ఉండమని వైద్యులు సలహా ఇచ్చారని సమాచారం. అక్షయ్ కుమార్ అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలలో నటించారు.