Andhra PradeshHome Page Slider

రేపే గ్రాండ్‌గా చిలకలూరిపేటలో “ఆరా ఫౌండేషన్” ఇఫ్తార్ విందు

Share with

 పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ప్రతిష్టాత్మక ఆరా ఫౌండేషన్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి గోల్కొండ గార్డెన్స్‌లో సర్వం సిద్ధం చేశారు ఆరా సభ్యులు.

ఈ ఆదివారం అనగా 16-4-2023 సాయంత్రం 4:00 నుండి చిలకలూరిపేట పట్టణం నరసరావుపేట రోడ్డు లోని గోల్కొండ గార్డెన్స్ లో ఇఫ్తార్ విందుతో పాటు  ప్రముఖ మోటివేటర్ బ్రదర్ షఫీ గారిచే “ఇహ పరలోక సాఫల్య మార్గం” అనే అంశంపై  గొప్ప ఆధ్యాత్మిక సందేశం కలదు. ఈ కార్యక్రమ శిబిరంలోకి ప్రవేశించుటకు ఎంట్రీ పాస్ లను ఏర్పాటు చేసారు. ఈ విందులో పాల్గొనువారు  9290092575( శ్రీ నాగిరెడ్డి) కు ఫోన్ చేసి పాస్ లను పొందగలరని ఆరా ఫౌండేషన్ మేనేజింగ్ డైరక్టర్, చైర్మన్‌ షేక్ మస్తాన్ తెలియజేశారు.

ఈ కార్యక్రమం ముఖ్యంగా రంజాన్ ఉపవాసాలు చేసినవారి కోసం ఏర్పాటు చేయబడింది. ఆ ప్రాంతంలోని అన్ని మసీదులలో ఎంట్రీ పాసులు ఇస్తున్నారు. ఇఫ్తార్ కిట్‌లను కూడా అందజేస్తున్నారు. ఈ అవకాశాన్ని ముస్లిం సోదరులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు.