Home Page SliderNational

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం..278 మంది దుర్మరణం

Share with

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో  ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 278 మంది మృత్యువాత పడగా..మరో 900 మందికి గాయలయ్యాయి. అయితే క్షతగాత్రులల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి పశ్చిమబెంగాల్‌కు వెళ్తున్న హావ్‌డా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహనగా బజార్ వద్ద రాత్రి సమయంలో పట్టాలు తప్పింది. దీంతో దాని భోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అయితే వాటిని ఫాలిమర్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్సప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లోని 15 భోగీలు బోల్తాపడ్డాయి.అయితే ఈ ప్రమాదం ఇంతటితో ముగిసిపోలేదు. బోల్తాపడిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్  భోగీలను ప్రక్కనున్న ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైళు ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా నుంచి చెన్నై వెళ్తున్నట్లు తెలుస్తోంది. భారత దేశ రైల్వే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ప్రమాదం జరిగినట్లు పలువురు ప్రముఖులు చెప్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై దేశప్రధానితో పాటు రాష్ట్రపతి ద్రౌహది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు జరుగుతున్నాయి.