Home Page SliderTelangana

ప్రేమకు అడ్డు వస్తున్నాడని స్నేహితుడిని చంపిన విద్యార్థి

Share with

టిజి: ప్రేమకు అడ్డువస్తున్నాడని స్నేహితుడిని ఇంటర్ విద్యార్థి హతమార్చిన సంఘటన మూసాపేట వద్ద జరిగింది. యూసఫ్‌గూడలోని కాలేజీలో మృతుడు డానిష్ (17), నిందితులు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని డానిష్‌పై రౌడీషీటర్ కుమారుడు పగ పెంచుకున్నాడు. ఈ నెల 23న వీరంతా కలిసి మద్యం తాగారు. అనంతరం 8 మంది స్నేహితులతో కలిసి రౌడీషీటర్ కుమారుడు (17) డానిష్‌ను బీరుసీసాతో కొట్టి చంపాడు.