Home Page SliderNational

సింహాన్ని దత్తత తీసుకున్న స్టార్ హీరో

Share with

తమిళనాడులో ప్రముఖ స్టార్ హీరో శివకార్తీకేయన్. “రెమో” సినిమాతో తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన తాజాగా 3 ఏళ్ల సింహాన్ని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వండలూరులో ఉన్న అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో గల షేరు అనే సింహాన్ని 6 నెలలపాటు శివకార్తీకేయన్ దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇకపై ఓ ఆరు నెలలపాటు షేరు బాగోగులను ఆయన చూసుకోనున్నారు. అయితే ఆయన ఇప్పటికే ఓ ఏనుగును కూడా దత్తత తీసుకున్నారు. దీంతో శివకార్తీకేయన్ అభిమానులు దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తమిళ్‌లో మొదట యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శివకార్తికేయన్ ఎంతో కష్టపడి సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు. కాగా ఆయన మొదటగా హీరో ధనుష్ సినిమాలో ఫ్రెండ్ పాత్రలో కన్పించారు. ఆ తర్వాత హీరో ధనుష్ నిర్మాతగా ఓ సినిమాలో హీరోగా నటించారు. కాగా ఈ సినిమా తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. అప్పటినుంచి శివకార్తికేయన్ నటించిన సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. దీంతో కొద్ది కాలంలోనే శివకార్తీకేయన్ కోలీవుడ్‌ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.