National

యాక్సిస్ బ్యాంక్‌ ఖాతాదారులకు షాక్

Share with

యాక్సిస్ బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును అన్ని కాలపరిమితులపై 25బేసిస్ పాయింట్లు పెంచింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలులోనికి తీసుకోస్తున్నట్టు పేర్కొంది. బ్యాంక్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం మెజారిటీ ఖాతాలకు అనుసంధానంగా ఉండే ఏడాది కాల వ్యవధి రేటును 25 బేసిస్ పాయింట్లు పెరిగి , 8.35 శాతానికి చేరింది. ఏడాది , ఆరు , మూడు నెలల కాలపరిమితులకు రుణ రేట్లు పావువంతు పెంచడంతో 8.15శాతం నుండి 8.30 శాతానికి చేరాయి. రెండు సంవత్సరాల ఎంపీఎల్‌ఆర్ 8.45 శాతంగా ఉండగా.. మూడేళ్ల రేటు 8.50 శాతానికి ఎగసింది. తదుపరి సమీక్ష వరకు ఈ రేట్లు అమలులో ఉంటాయని బ్యాంక్ ప్రకటించింది.