Andhra PradeshHome Page Slider

ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టిన పవర్ స్టార్

Share with

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడాలనుకున్న జనసైనికుల కళ నెరవేరింది. అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా గెలిచిన తొలిసారే ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీకి వచ్చారు. కాగా అసెంబ్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు హత్తుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన ఆయన అభిమానులు కళ్లు చెమ్మగిల్లుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఆయన దాదాపు 10 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి, ఎన్నో మాటలు పడి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో ఈ క్షణాన్ని జనసైనికులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.