Home Page SliderNational

వందేభారత్‌కు తప్పిన ముప్పు

Share with

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లు నాణ్యత లోపించినట్లు కన్పిస్తున్నాయి. కాగా కేంద్రం ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా  పదుల సంఖ్యలో వందేభారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ  నేపథ్యంలో కొత్తగా ప్రారంభించిన  పూరి-హౌరా వందేభారత్ ఎక్సప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాకు చేరుకోగానే అక్కడ ఉరుములకు మెయిన్ ఇంజిన్  విండ్ స్క్రీన్ దెబ్బతింది. అలాగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని బోగీల గ్లాస్ విండోలు కూడా డ్యామేజ్ అయ్యాయి. దీంతోపాటు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో పూరి -హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అక్కడే ఆగిపోయింది. మరో డీజిల్ ఇంజిన్ వచ్చి దాన్ని తీసుకెళ్లిందని అధికారులు వెల్లడించారు. కాగా ఈ సమయంలో రైలులో ఉన్న 250 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని..వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.