Home Page SliderNational

మూడు రాష్ట్రాలలో వికసిస్తున్న కమలం

Share with

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని భారతదేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో కమల వికాసం మొదలయ్యింది.  ఇప్పటికే ఓట్ల లెక్కింపు మొదలవగా, మూడు రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అనంతరం జాతీయపార్టీ కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 157 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 70 స్థానాలలోనూ, ఇతరులు 3 స్థానాలలోనూ కొనసాగుతున్నారు. మన పొరుగున ఉన్న ఛత్తీస్ ఘడ్‌లో కూడా బీజేపీ 54 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 34 స్థానాలలోనూ, ఇతరులు 2 స్థానాలలోనూ ముందంజలో ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రమైన రాజస్థాన్‌లో కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌ను వెనక్కునెట్టి బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 76 స్థానాలలో ఉండగా, బీజేపీ 106 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. దీనితో కమలనాథులలో జోష్ నెలకొంది.