Andhra PradeshHome Page Slider

నిద్ర మత్తులో డ్రైవర్ – కాల్వలో దూసుకెళ్లిన బస్సు

Share with

ప్రకాశం జిల్లాలోని దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి దాటాక డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూడడంతో బస్సు సరాసరి సాగర్ కెనాల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ బస్సులో పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తున్న పెళ్లి బృందం ఉంది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు, 12 మంది గాయపడ్డారు. బస్సు పొదిలి నుండి కాకినాడ వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్(65),అబ్దుల్ హాని(60), షేక్ రమీజా(48),ముల్లా నూర్జహాన్(58), ముల్లా జానీబేగం(65),షేక్ షబీనా(35), షేక్ హీనా(6) లు మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన ముగ్గురిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. టీడీపీ నేత చంద్రబాబు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఏపీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.