Home Page SliderNational

పెళ్లి పీటలెక్కిన ప్రముఖ స్టార్ క్రికెటర్

Share with

ప్రముఖ స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ ఓ ఇంటివాడయ్యాడు. ఈయన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్లేయర్. కాగా మిచెల్ మార్ష్ ఈ IPL సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. అయితే ఆయన  పెళ్లి కోసమే ఈ IPL నుంచి మధ్యలోనే తన స్వదేశానికి వెళ్లారు.  ఈ నేపథ్యంలో ఆయన నిన్న గ్రెటా మాక్‌ని వివాహమాడారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాలో మిచెల్ తన భార్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఇది “నా జీవితంలో బెస్ట్ డే” అని పోస్ట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియన్ టీమ్ కోప్లేయర్స్‌తో పాటు ఢిల్లీ టీమ్ సభ్యులు కూడా మిచెల్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు క్రికెట్ అభిమానులు కూడా ఇన్‌స్టా వేదికగా మిచెల్‌ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.