Home Page Slider

తాను చనిపోలేదంటున్న ప్రముఖ నటుడు

Share with

ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై చాలా ఎక్కువగానే ఉంది. అది ఎంతలా అంటే మనిషి బ్రతికున్నా సరే..ఒకవేళ సోషల్ మీడియాలో చనిపోయారంటే హ..అవును చనిపోయారు అని నమ్మేంతగా. అయితే ఇటువంటి అసత్య ప్రచారాలు ఎక్కువగా సెలెబ్రిటీల విషయంలోనే జరుగుతాయని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ఎక్కవమంది వారి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఇటువంటి ఘటనే టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారికి కూడా ఎదురైంది. ఆయన మరణించారంటూ తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆయనే స్వయంగా తాను బ్రతికేవున్నానంటూ ఓ వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..నేను బ్రతికే ఉన్నానని తెలిపారు. కాగా సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం కారణంగా ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి  తనకు అనేక ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం తన నివాసానికి చేరుకున్నారని తెలిపారు. అయితే ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా  ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఆయన ఈ వీడియోలో హెచ్చరించారు.