NationalNews Alert

పేషెంట్ ప్రాణం కోసం డాక్టర్ పరుగు         

Share with

డాక్టర్స్ అంటే దైవంతో సమానమని అందరు అంటుంటే వినే ఉంటాం. కానీ ఈ డాక్టర్‌ చేసిన పని చూస్తే అది కచ్చితంగా నిజమే అంటారు. బెంగుళూరులో ఓ డాక్టర్ చేసిన పనికి అందరు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఓ డాక్టర్ అర్జెంట్‌గా సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే బీజీ ట్రాఫిక్ కారణంగా తన కారు రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయింది. ఆపరేషన్ టైంకి చేయకపోతే అక్కడ ఓ ప్రాణం పోతుందని తెలిసిన డాక్టర్ వెంటనే కారు దిగి పరిగెత్తడం మొదలు పెట్టాడు. దాదాపు 3 కిలో మీటర్ల వరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అంతే కాకుండా ఆపరేషన్ సక్సెస్‌గా చేసి ప్రాణాన్ని నిలబెట్టి.. నిజంగా డాక్టర్స్ అంటే దైవంతో సమానమే అనే మాటకు ప్రత్యక్ష సాక్షంగా నిలిచాడు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.