NationalNewsNews Alert

ఢిల్లీ ఆజాదీ మార్కెట్‌లో కుప్పకూలిన భవనం

Share with

నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా ఒక భవనం కుప్పకూలింది. ఢిల్లీలోని ఆజాది మార్కెట్ ‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మార్కెట్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగు అంతస్తుల భవనం ఈ రోజు ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ అండ్   రెస్య్కూ ఆపరేషన్ జరుగుతోంది.